Punjab: మొహాలీలోని పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో పేలుడు

మొహాలీలోని పంజాబ్‌ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో అనుమానాస్పద పేలుడు చోటుచేసుకుంది.

Updated : 10 May 2022 05:19 IST

పంజాబ్‌: మొహాలీలోని పంజాబ్‌ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో అనుమానాస్పద పేలుడు చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని ఓ భవనం లక్ష్యంగా రాకెట్‌ ఆధారిత గ్రెనేడ్‌ విసిరినట్లు వార్తలు వచ్చాయి. సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి విచారణ చేపట్టారు. అయితే ఈపేలుడు ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ఉగ్రదాడి కాదని, పేలుడు చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ పోలీసు ఉన్నతాధికారులను సమగ్ర నివేదిక కోరారు. ఈ పేలుడు కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్థులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని