Ambikapur: రైతుల డిమాండ్లు నెరవేర్చాలి: జైరాం రమేష్‌

రైతుల కోసం పాటుపడిన చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లను కేంద్రం భారతరత్నతో సత్కరించిందని, కాని అదే రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. 

Published : 13 Feb 2024 17:43 IST

అంబికాపూర్: రైతుల అభ్యున్నతి కోసం పాటుపడిన చౌదరి చరణ్‌సింగ్‌(Chaudhary Charan Singh), వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌(MS Swaminathan)లకు కేంద్రం భారతరత్న  అవార్డులను ప్రకటించిందని, కాని అదే రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఆరోపించారు. వేలాది మంది రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పై చట్టం చేయాలని డిమాండ్‌ చూస్తూ ‘దిల్లీ చలో’ మార్చ్‌ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం  రైతు నాయకుడు చరణ్ సింగ్,  ' భారత హరిత విప్లవ పితామహుడు' స్వామినాథన్‌లకు తగిన గౌరవమిచ్చింది. కాని వారు ఎవరి కోసమైతే కష్టపడ్డారో ఆ కర్షకులకు మాత్రం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు 1.5 రెట్ల కనీస మద్దతు ధర నిర్ణయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2008లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూ.72 వేలకోట్ల  రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు.

నేడు(మంగళవారం) రైతులు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున చేపట్టనున్న ‘దిల్లీ చలో మార్చ్‌’ను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల వద్ద కాంక్రీట్ బ్లాక్‌లు, బారికేడ్లు, కంటైనర్ల గోడలతో దారులు మూసివేయిచింది. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని