G20 Summit lunch: జాఫ్రానీ గుచ్చీ పులావ్‌.. కుర్‌కురీ బెండీ.. విదేశీ అగ్రనేతలకు దేశీయ రుచులు

ప్రపంచ దేశాధినేతలకు దేశీయంగా ప్రత్యేకమైన వంటకాలను భారత్‌ మండపం వద్ద సిద్ధం చేశారు. ఐటీసీ హోటల్స్ ఈ బాధ్యతలను స్వీకరించినట్లు తెలుస్తోంది. జాఫ్రానీ గుచ్చీ పులావ్‌, కశ్మీరీ ఖావా వంటి ప్రత్యేక రుచులను సిద్ధం చేశారు. 

Updated : 09 Sep 2023 13:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit)లో ప్రపంచ అగ్రనేతలకు భారతీయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఈ మేరకు భారత్‌ మండపం వద్ద వంటకాలను సిద్ధం చేశారు. ఈ రెండు రోజులు పాటు ఈ వీఐపీ సదస్సుకు ఐటీసీ హోటల్స్‌ ఆహారాన్ని అందిస్తున్నాయి. వివిధ దేశాల అగ్రనాయకులు బ్రేక్‌ ఫాస్ట్‌ మాత్రం వారివారికి కేటాయించిన విడిది హోటళ్లలోనే పూర్తిచేస్తారని ప్రభుత్వ వర్గాలు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించాయి. లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌, పానీయాలను మాత్రం భారత్‌ మండపంలో స్వీకరిస్తారు. అందు కోసమే ఐటీసీ హోటల్స్‌ తమ పాకశాస్త్ర నిపుణులు మొత్తాన్ని అక్కడికే చేర్చింది. వసుధైక కుటుంబం థీమ్‌లో మెనూ సిద్ధం చేయడం కోసం వీరిని వినియోగిస్తోంది. 

జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

  • భారత్‌లోని మసాలా, సుగంధ ద్రవ్యాల విశిష్టతను విదేశీ అతిథులకు తెలియజేసేలా మెనూను సిద్ధం చేశారు. తందూరీ ఆలూ, కుర్‌కురీ బెండీ, జాఫ్రానీ గుచ్చీ (ఒకరకమైన పుట్టగొడుగులు) పులావ్‌, పన్నీర్‌ తిల్వాల వంటివి శనివారం లంచ్‌లో అందిస్తున్నారు.
  • డిన్నర్‌లో పెరుగు, చిరుధాన్యాలు, చట్నీతో కూడిన చాట్‌ ఏర్పాటు చేశారు. ఇక మెయిన్‌ కోర్స్‌లో పనసపండుతో చేసిన గాలెట్టె (బ్రెడ్‌ వంటి ఫ్రెంచి వంటకం), గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌ కూడా అందిస్తారు.
  • ఇక అతిథులు ఎక్కువగా ఇష్టపడే డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉంటాయి.
  • పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని