G20 Summit: దిల్లీ డిక్లరేషన్‌ ఓ సానుకూల సంకేతం: చైనా

‘దిల్లీ డిక్లరేషన్‌’పై (G20 Summit declaration) చైనా స్పందించింది. ఆర్థిక పునరుద్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతాన్ని పంపిస్తోందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు.

Published : 11 Sep 2023 21:27 IST

బీజింగ్‌: భారత్‌ (India) అధ్యక్షతన జీ20 సదస్సు (G20 Summit) నిర్వహించడంతో ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘దిల్లీ డిక్లరేషన్‌’పై సభ్య దేశాల ఏకాభిప్రాయం తీసుకురావడం భారీ విజయంగా చెబుతున్నారు. ఈ క్రమంలో చైనా (China) కూడా స్పందించింది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాన్ని దిల్లీ డిక్లరేషన్‌ ఇస్తోందని పేర్కొంది. ‘చైనా ప్రతిపాదన ఓ మంచి సంకేతమని జీ20 సదస్సు విడుదల చేసిన డిక్లరేషన్‌ ద్వారా నిరూపితమైంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాన్ని దిల్లీ డిక్లరేషన్‌ ఇచ్చింది. ఆర్థిక పునరుద్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతాన్ని పంపిస్తోంది’ అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు.

త్వరలో ‘సముద్రయాన్‌’.. మత్స్య-6000 జలాంతర్గామి ఫొటోలు విడుదల చేసిన కేంద్రమంత్రి

దిల్లీలో జరిగిన జీ20 సదస్సు ఫలితాన్ని చైనా ఏవిధంగా చూస్తుందన్న దానికి ఈ విధంగా స్పందించారు. డిక్లరేషన్‌ సిద్ధం చేసే ప్రక్రియలోనూ చైనా నిర్మాణాత్మకమైన పాత్రను పోషించిందన్న ఆయన.. అభివృద్ధి చెందుతోన్న దేశాల ఆందోళనలకు ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లో రెండు రోజులపాటు జరిగిన జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సభ్యదేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని