G20 summit : గాంధీ, మోదీ.. భారత్‌కు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తులు : దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి ప్రశంస

భారత్‌ (India) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 summit) ఆదివారం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పండోర్‌ ప్రధాని మోదీని (Narendra modi) పొగడ్తలతో ముంచెత్తారు.

Published : 11 Sep 2023 02:38 IST

దిల్లీ : జీ-20 శిఖరాగ్ర సదస్సుకు (G20 summit) భారత్‌ (India) నాయకత్వం వహించడంపై ప్రపంచ దేశాల నుంచి పొగడ్తలు వెల్లువెత్తున్నాయి. ఈ సదస్సును విజయవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) చూపిన చొరవను పలువురు విదేశీ నేతలు అభినందిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పండోర్‌ మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధిలో మహాత్మాగాంధీ, నరేంద్రమోదీ ముఖ్యపాత్ర పోషించిన గొప్పవ్యక్తులని కొనియాడారు. మహాత్ముడు అహింస ఉద్యమాన్ని భారత్‌లో ప్రవేశపెడితే.. ప్రధాని నరేంద్రమోదీ బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదిగేందుకు దోహదపడ్డారని చెప్పారు. ‘ఆయన కంటే ముందు ప్రధాన మంత్రులు కీలకపాత్ర పోషించారు. అయినా మోదీ భారతదేశ గుర్తింపును మెరుగుపరిచారు. ఇండియాను ఓ బ్రాండ్‌గా మార్చారని’ పండోర్‌ అన్నారు.

కెనడాలో ‘ఖలిస్థానీ’ నిరసనలు.. ప్రధాని ట్రూడో ఏమన్నారంటే!

జీ-20కి భారత్ అధ్యక్షత వహించడంపై దక్షిణాఫ్రికా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘గ్రూప్‌ ఆఫ్‌ 20’లో ఆఫ్రికన్‌ యూనియన్‌ను చేర్చుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ బృందానికి బ్రాండ్‌ ముఖ్యం కాబట్టి జీ-20 పేరును.. జీ-21గా మార్చాలని తాను ఆశించడం లేదని చెప్పారు. న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన గౌరవం భారత్ షెర్పాకు దక్కుతుందన్నారు. ఇందులో ప్రధాని మోదీ పాత్ర మరువలేదని పేర్కొన్నారు. అనంతరం ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఓ సంస్కృత వాక్కు పలికి ప్రధాని నరేంద్రమోదీ జీ-20 సదస్సు ముగిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడం నాకెంతో సంతృప్తినిచ్చింది. అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సల్వాకు అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని