మర్యాదపూర్వకంగా కూడా చెప్పరా..!

కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన విషయం తనకు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాక తెలిసిందని రాష్ట్ర గవర్నర్‌ మొహ్మద్‌ ఖాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌ వేసే ముందు కనీసం గవర్నర్‌కు మర్యాద

Published : 17 Jan 2020 00:21 IST

సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వంపై ఆగ్రహించిన గవర్నర్‌

కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన విషయం తనకు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాక తెలిసిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహ్మద్‌ ఖాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌ వేసే ముందు కనీసం గవర్నర్‌కు మర్యాద పూర్వకంగానైనా తెలియజేయాల్సివుందని ఆయన హితవు పలికారు. సీఏఏపై కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ గురించి మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. 

‘కేరళ ప్రభుత్వం పిటిషన్‌ వేయడాన్ని నేను తప్పుబట్టడం లేదు. వాళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఉంది. కానీ గవర్నరైన నా దగ్గర ముందస్తు అనుమతి తీసుకోలేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా నాకు తెలియజేయలేదు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయొచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తాననని ఆయన తెలిపారు. ‘రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న నేను సీఏఏపై కేరళ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన విషయాన్ని వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్‌ ద్వారా తెలుసుకున్నాను’ అని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని