కరోనా కేసులనూ బీమాలో చేర్చండి: ఐఆర్‌డీఏ

కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎలాంటి బీమాను.........

Updated : 12 Mar 2020 15:39 IST


దిల్లీ: కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎలాంటి బీమాను కలిగి ఉన్నా కరోనా వైరస్‌కు చికిత్సను కూడా అందులో చేర్చాలని అన్ని ఆరోగ్య బీమా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 4న సర్క్యులర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏ.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులకు తక్షణమే వైద్య బీమా వర్తింపజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్య బీమా పాలసీ ఉంటే ఆరోగ్య బీమా కంపెనీలు తక్షణమే స్పందించాలని ఐఆర్‌డీఏ తేల్చి చెప్పింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చులను వారి పాలసీ నిబంధనల ప్రకారం చెల్లించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ కేసులను తిరస్కరించేముందు వాటిని క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొత్త పాలసీని రూపొందించే సమయంలో కరోనాను కూడా చేర్చాలనీ.. ఆ వైద్యానికయ్యే ఖర్చును పొందుపరచాలని ఐఆర్‌డీఏ ఆదేశించింది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని