ఇజ్రాయెల్‌: కరోనా అనుమానితుల ఫోన్లు ట్రాక్‌

కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఈక్రమంలో దాన్ని నివారించేందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలున్న వారి ఫోన్లు ట్రాక్‌ చేయాలని నిర్ణయించింది.

Published : 17 Mar 2020 22:22 IST

జెరూసలెం(ఇజ్రాయెల్‌): కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో దాన్ని నివారించేందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలున్న వారి ఫోన్లు ట్రాక్‌ చేయాలని నిర్ణయించింది. తద్వారా కరోనా బాధితులను గుర్తించే వీలుంటుందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఫోన్ల ట్రాకింగ్‌ విషయం గతవారమే ప్రధాని ప్రస్తావించారు. అప్పుడు వ్యక్తిగత సమాచార గోప్యతపై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, చివరకు ఫోన్‌ ట్రాకింగ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు. ఎవరిని కలిశారు అనే వివరాలు తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని ప్రధాని అధికారులకు సూచించారు. కాగా.. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకూ 75కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటికే ఆత్యయిక స్థితి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని