163 రైళ్లలో 1.60 లక్షల మంది తరలింపు

లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు.......

Published : 07 May 2020 15:34 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు లక్షా 60 వేల మందిని తరలించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మే 1 నుంచి ఇప్పటి వరకు 163 రైళ్లను నడిపినట్లు తెలిపింది. బుధవారం వరకు 149 రైళ్లను నడపగా.. గురువారం మరో 14 రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ప్రతి శ్రామిక్‌ రైల్లోనూ 24 కోచ్‌లు ఉన్నాయని రైల్వే శాఖ పేర్కొంది. 72 మంది వరకు ప్రయాణించే వీలున్నప్పటికీ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం దృష్ట్యా కోచ్‌కు 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు శ్రామిక్‌ రైళ్ల ద్వారా గుజరాత్‌ నుంచి అత్యధికంగా తమ స్వస్థలాలకు బయల్దేరారు. కేరళ ఆ తర్వాతి స్థానంలో ఉంది. చేరుకున్న రాష్ట్రాల్లో బిహార్‌, యూపీ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, శ్రామిక్‌ రైళ్ల కోసం ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఖర్చు చేసిందీ రైల్వేశాఖ అధికారికంగా వెల్లడించనప్పటికీ ఒక్కో సర్వీసుకు సుమారు రూ.80 లక్షలు ఖర్చవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని