చైనాలో తెరుచుకున్న థీమ్‌పార్క్‌

కరోనా మహమ్మారి భయాందోళనలతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కానీ.. వైరస్‌కు పుట్టినిల్లైన చైనా మాత్రం దేశంలోని పార్కులను తిరిగి తెరిచేందుకు నిర్ణయించింది.

Published : 11 May 2020 23:55 IST

షాంఘై: కరోనా మహమ్మారి భయాందోళనలతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కానీ.. వైరస్‌కు పుట్టినిల్లైన చైనా మాత్రం దేశంలోని పార్కులను తిరిగి తెరిచేందుకు నిర్ణయించింది. సుదీర్ఘకాలం తరువాత షాంఘై నగరంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిస్నీల్యాండ్‌ థీమ్‌పార్క్‌ సందర్శకుల కోసం తెరుచుకుంది. కరోనా వ్యాప్తి దృష్టా జనవరిలో తాత్కాలికంగా మూత పడిన ఈ థీమ్‌ పార్కును తగు జాగ్రత్తలు పాటిస్తూ సోమవారం తిరిగి తెరిచారు. పార్కుల వద్ద రద్దీని నియంత్రించేందుకు కేవలం 30 శాతం టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయించి సందర్శకులను అనుమతించారు. కరోనా కారణంగా తాత్కాలికంగా మూతపడిన ప్రపంచంలోని ఆరు ప్రముఖ డిస్ని ల్యాండ్‌ థీమ్‌ పార్కుల్లో చైనాలోని థీమ్‌ పార్క్‌ను మాత్రమే సందర్శకుల కోసం తెరిచారు. ఇవాళ కూడా చైనాలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని