మానవ తప్పిదంతోనే విమాన ప్రమాదం

పాకిస్థాన్‌లో గత నెల జరిగిన విమాన ప్రమాదం మానవ తప్పిదంతోనే జరిగినట్లు విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పైలట్ నిర్లక్ష్యం..

Published : 24 Jun 2020 23:26 IST

పైలట్‌, కంట్రోలర్‌ కరోనా గురించి చర్చిస్తూ నిర్లక్ష్యం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో గత నెల జరిగిన ఘోర విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పైలట్ నిర్లక్ష్యం, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలో అలసత్వం వహించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ గురించి చర్చించుకూంటూ విమానాన్ని నిర్లక్ష్యంగా నేలపైకి దించుతుండగా ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులు, విమానయాన పరిశ్రమకు చెందిన అధికారులతో కూడిన పాకిస్థాన్ దర్యాప్తు బృందం డేటా, వాయిస్ రికార్డర్లను విశ్లేషించింది.

‘పైలట్‌తో పాటు కంట్రోలర్ కూడా ప్రామాణిక నియమాలను పాటించలేదు. విమానాన్ని నడుపుతున్నప్పుడు, ల్యాండ్ చేస్తున్నప్పుడు పైలట్‌, కంట్రోలర్‌ ఇద్దరు కరోనావైరస్పై చర్చిస్తూ నిర్లక్ష్యం వహించారు’ అని దేశ విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ బుధవారం పార్లమెంటులో జరిగిన సమావేశంలో వెల్లడించారు. విమానం 100 శాతం ఫిట్‌గా ఉందని, ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేశారు. మే 22వ తేదీన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం కరాచీ విమానాశ్రయానికి చేరుకోకమందే రెండు ఇంజన్లలో సమస్య ఏర్పడి ఇళ్ల సమూహంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 97 మంది మృతిచెందారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు