
China : ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్న గజరాజుల గుంపు
బీజింగ్: చైనాలోని రిజర్వు అటవీ ప్రాంతం నుంచి గతేడాది బయటకు వచ్చిన గజరాజుల గుంపు.. ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్నాయి. 14 ఆసియా ఏనుగుల మంద నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు తిరిగి వచ్చాయి. కొన్ని నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణం చేసిన సంచార ఏనుగులు.. గత ఐదు రోజులుగా యుగ్జీ నగరం సమీపంలో తిరిగాయి. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను పర్యవేక్షించారు. ట్రక్కులు అడ్డుపెట్టి ఏనుగులు తమ ఆవాసానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. యువాంగ్జియాంగ్ నది దాటేలా చర్యలు తీసుకున్నారు గురువారం యుగ్జీ నగరం నుంచి ఏనుగుల మంద అడవుల్లోకి తమ ప్రయాణం కొనసాగించింది. అయితే.. వాస్తవ ఆవాసానికి పూర్తిగా చేరుకోనప్పటికీ.. ఏనుగులు ప్రస్తుతం వాటికి అనువైన ప్రదేశంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. గతేడాది ఏనుగుల గుంపు జిషింగ్‌బన్న దాయ్ ప్రాంతంలోని అడవుల నుంచి 500 కి.మీ మేర ప్రయాణించి జూన్ 2న కున్మేందుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవి రద్దీ జనావాసాల్లోకి రాకుండా చైనా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.