Population: 2064లో అత్యధికంగా ప్రపంచ జనాభా: అమెరికా పరిశోధకుల విశ్లేషణ

ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందని, అయితే... శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనకర్తలు అంచనా ..

Updated : 26 Aug 2021 14:33 IST

శతాబ్దం చివరి నాటికి మాత్రం 50% తగ్గుదల

వాషింగ్టన్‌: ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందని, అయితే... శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనకర్తలు అంచనా వేశారు. మరీ అంత తగ్గుదల ఎందుకు ఉంటుందని ఆశ్చర్యపడాల్సిన పనిలేదట! సమాజం నుంచి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల కారణంగా మానవ పునరుత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమవుతుందని వారు విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్‌ మసాచూసెట్స్‌ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనాన్ని ‘ఎండోక్రైనాలజీ’ పత్రిక సమీక్షించింది.

‘‘జనాభా పెరుగుదలతో పాటు వారి మధ్య అర్థరహితమైన సామాజిక పరిస్థితులు కూడా ఎక్కువవుతున్నాయి. దీనికితోడు జీవనశైలిలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. గత 50 ఏళ్లలో పురుషుల వీర్యాణువులు దాదాపు సగం మేర తగ్గిపోయాయి. ఫలితంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మానవ పునరుత్పత్తి తీరులో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. అయితే 2064 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాతి నుంచి ఆ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. దంపతుల్లో సంతానలేమి పెరుగుతుంది. పెద్ద వయసులో వివిధ ప్రత్యామ్నాయ విధానాల్లో పిల్లలను కనేవారు ఎక్కువవుతారు. కొన్నిరకాల జంతువులకు గతంలో పునరుత్పత్తి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా పలు జాతులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించే దశలో ఉన్నాయి. మానవ సమాజానికి కూడా ఇలాంటి సవాళ్లు తప్పకపోవచ్చు. ప్రస్తుత శతాబ్దం చివరినాటికి మానవ పునరుత్పత్తి భారీగా తగ్గుతుంది’’ అని ఎండోక్రైన్‌ సొసైటీ నిపుణులు విశ్లేషించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని