DGCA: విమానయాన సిబ్బందికి డ్రగ్స్‌ పరీక్షలు

విమానాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, గగనయాన రాకపోకలు నియంత్రించే ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి 31 నుంచి మాదక ద్రవ్యాల ..

Published : 29 Sep 2021 13:03 IST

జనవరి 31 నుంచి అమలు

దిల్లీ: విమానాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, గగనయాన రాకపోకలు నియంత్రించే ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి 31 నుంచి మాదక ద్రవ్యాల పరీక్షలు చేయనున్నారు. మనుషుల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపించే గంజాయి, కొకెయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు సిబ్బంది దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వీటి వినియోగం, లభ్యత విమాన ప్రయాణికుల భద్రతపరంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలుగా సోమవారం జారీచేసిన ఆదేశాల్లో పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని