National News: స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి.. బంగారం చోరీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో పెద్ద సొరంగం తవ్వి బంగారం దోపిడీ చేశారు దుండగులు. ఎస్‌బీఐ భనుతి శాఖలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఉద్యోగులు కార్యాలయానికి రాగా.. వెలుగులోకి వచ్చింది.

Updated : 24 Dec 2022 08:34 IST

కాన్పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో పెద్ద సొరంగం తవ్వి బంగారం దోపిడీ చేశారు దుండగులు. ఎస్‌బీఐ భనుతి శాఖలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఉద్యోగులు కార్యాలయానికి రాగా.. వెలుగులోకి వచ్చింది. పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి లోపలికి చేరుకున్నారు. లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. ఎంత దోపిడీ చేశారో నిర్ధారించడానికి అధికారులకు గంటలకొద్ది సమయం పట్టింది. ‘‘వేలి ముద్రలు, ఇతర ఆధారాల ద్వారా దొంగలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకు నిర్మాణం బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారు. మరో లాకర్‌లో ఉన్న రూ.32 లక్షలను దొంగిలించడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారు’’ అని డీజీపీ విజయ్‌ డూల్‌ అన్నారు. కేసును ఛేదించడానికి సీనియర్‌ అధికారుల నేతృత్వంలో పలు పోలీసుల బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ బీపీ జోగ్దండ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని