సహజీవన భాగస్వాముల వివరాలతోకేంద్రం ఏమి చేస్తుంది?

సహజీవనం చేస్తున్న వ్యక్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Published : 21 Mar 2023 04:36 IST

ఆ బంధాల నమోదు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: సహజీవనం చేస్తున్న వ్యక్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ సంబంధాల నమోదుకు  ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను కొట్టివేసింది. అది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషనర్‌పై మండిపడింది. సహజీవన బంధాలను నమోదు చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుందని ప్రశ్నించింది.  శ్రద్ధా వాకర్‌ను ఆమెతో సహజీవనం చేసిన ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇటువంటివే పలు నేరాలు సమాజంలో జరుగుతున్నాయని, నిరోధించడానికి తగు చర్యలు అవసరమంటూ రాణి అనే మహిళ సుప్రీంకోర్టులో  వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సహజీవనం చేసే వారికి భద్రత కల్పించాలని పిటిషనర్‌ చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని