న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయలేరు

న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయజాలరని, కొలీజియం విషయంలో మరో ఆలోచనకు, చర్చలకు తావే లేదని మాజీ బ్యూరోక్రాట్లు స్పష్టం చేశారు.

Published : 31 Mar 2023 04:53 IST

రిజిజు వ్యాఖ్యలపై మాజీ బ్యూరోక్రాట్ల బహిరంగ లేఖ

దిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయజాలరని, కొలీజియం విషయంలో మరో ఆలోచనకు, చర్చలకు తావే లేదని మాజీ బ్యూరోక్రాట్లు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా పదేపదే కొలీజియం తీరును తప్పుబట్టడం, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడి చేయడం కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుకు తగదని హితవు పలికారు. ఈ మేరకు 90 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఆయనకు కాన్‌స్టిట్యూషనల్‌ కండక్ట్‌ గ్రూప్‌ (సీసీజీ) పేరుతో గురువారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో దిల్లీ మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై, విదేశాంగశాఖ మాజీ  కార్యదర్శి సుజాతా సింగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతా రావు తదితరులున్నారు. కొంత మంది పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను భారత వ్యతిరేక శక్తులని ఆరోపించడం తగదని వారు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించడంద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఎవరి అభిప్రాయాలపైనైనా అభ్యంతరాలుంటే న్యాయ మంత్రిగా మీకున్న అవకాశాలను ఉపయోగించుకుని సరైన వేదికలపై మాట్లాడవచ్చని, చర్చలు జరపవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని