ఫోను నీటిలో పడిందని.. రిజర్వాయర్‌ తోడేశారు!

ఓ అధికారి ఖరీదైన ఫోను నీళ్లలో పడిందని గ్రామ ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు ఆధారమైన రిజర్వాయరు నీరు మొత్తం బయటకు తోడించిన వైనమిది.

Updated : 27 May 2023 13:18 IST

ఛత్తీస్‌గఢ్‌లో అధికారి సస్పెన్షన్‌

ఓ అధికారి ఖరీదైన ఫోను నీళ్లలో పడిందని గ్రామ ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు ఆధారమైన రిజర్వాయరు నీరు మొత్తం బయటకు తోడించిన వైనమిది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లా కోయిలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ విశ్వాస్‌ తన మిత్రులతో కలిసి విహారయాత్రగా పరల్‌కోట్‌ రిజర్వాయరు వద్దకు వెళ్లారు. అక్కడాయన సరదాగా సెల్ఫీ దిగుతున్న సమయంలో రూ.96 వేల విలువైన శామ్‌సంగ్‌ ఎస్‌23 ఫోను నీళ్లలో పడిపోయింది. కంగారుపడిన రాజేశ్‌ జలవనరుల శాఖ అధికారులకు ఫోను చేసి విషయం చెప్పారు. 30 హెచ్‌పీ సామర్థ్యం గల పంపులతో జలవనరుల శాఖ సిబ్బంది క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమై జలాశయం నీటిని తోడే పనిని ప్రారంభించారు. మూడు రోజులు గడిచేసరికి దాదాపు 41 లక్షల లీటర్ల నీటిని వృథాగా బయటకు తోడేశారు. మూడు రోజుల తర్వాత ఆ ఫోన్‌ను బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ను సస్పెండు చేసిన కాంకేర్‌ జిల్లా కలెక్టర్‌ జలవనరుల శాఖ ఎస్‌డీవో రాంలాల్‌ ధివర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని