మంచి దుస్తులు, కళ్లజోడు ధరించినందుకు దళితుడిపై దాడి

ఓ దళితుడు మంచి దుస్తులు ధరించి, కళ్లద్దాలు పెట్టుకున్నందుకు ఓర్వలేక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గుజరాత్‌ పాలన్‌పుర్‌ ప్రాంతంలోని మోటా గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 02 Jun 2023 03:51 IST

గుజరాత్‌లో ఘటన

పాలన్‌పుర్‌: ఓ దళితుడు మంచి దుస్తులు ధరించి, కళ్లద్దాలు పెట్టుకున్నందుకు ఓర్వలేక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గుజరాత్‌ పాలన్‌పుర్‌ ప్రాంతంలోని మోటా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు జిగర్‌ షెఖాలియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిగర్‌ షెఖాలియా మంగళవారం రాత్రి ఓ గుడి బయట నిల్చొని ఉండగా, అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చారు. ‘కొన్నిరోజులుగా నువ్వు నేల మీద నిలవడం లేదు. ఫ్యాషన్‌ దుస్తులు, కళ్లద్దాలు ఎందుకు ధరించావు’ అని ప్రశ్నిస్తూ దాడి చేశారు. అడ్డుకోబోయిన అతడి తల్లినీ చితకబాదడంతోపాటు ఆమె దుస్తులు చించేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని