VIRAL VIDEO: మినీబస్సును ఆపేందుకు బానెట్‌పైౖౖకి యువకుడు

మినీ బస్సును ఆపేందుకు ఓ యువకుడు బానెట్‌ పైకి ఎక్కినా ఖాతరు చేయకుండా డ్రైవరు వాహనాన్ని 4 కి.మీ. ముందుకు పోనిచ్చిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

Updated : 19 Dec 2023 08:18 IST

 4 కి.మీ దూసుకెళ్లిన డ్రైవరు

మినీ బస్సును ఆపేందుకు ఓ యువకుడు బానెట్‌ పైకి ఎక్కినా ఖాతరు చేయకుండా డ్రైవరు వాహనాన్ని 4 కి.మీ. ముందుకు పోనిచ్చిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు విక్కీ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి అతడు తన ట్రక్కులో డ్రైవరుతో కలసి వెళ్తుండగా, మినీ బస్సు వారి వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే యత్నం చేసింది. ఈ క్రమంలో దాని వెనుక భాగం ట్రక్కుకు తగిలింది. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన విక్కీ.. మినీ బస్సు డ్రైవరును కిందకు దిగాలంటూ హెచ్చరించాడు. అయితే డ్రైవరు వాహనాన్ని ముందుకు పోనిస్తుండటంతో అడ్డగించేందుకు అతడు బానెట్‌పైకి ఎక్కాడు. అయినా వాహనాన్ని ఆపని డ్రైవరు అలాగే సుమారు 4 కి.మీ. ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత వాహనాన్ని ఆపడంతో విక్కీ కిందకు దిగాడు. ఆ వెంటనే డ్రైవరు అక్కణ్నుంచి వేగంగా వాహనంలో పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని