800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్‌ బోల్తా

డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్‌ బోల్తా కొట్టింది.

Published : 08 May 2024 04:07 IST

విలువ రూ. 666 కోట్లు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్‌ బోల్తా కొట్టింది. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా  చిê్తోడు సమత్తువపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఓ ప్రైవేట్‌ లాజిస్టిక్స్‌కు చెందిన కంటెయినర్‌ సోమవారం రాత్రి కోయంబత్తూరు నుంచి రూ. 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో సేలం బయలుదేరింది. సమత్తువపురం దగ్గరకు వచ్చేసరికి ఓ మలుపులో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కంటెయినర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంగారు నగలను మరో వ్యాన్‌లోకి మార్పించి కొంతమంది సిబ్బంది తోడుగా సేలం పంపారు. గాయాలపాలైన డ్రైవర్‌ శశికుమార్‌, సెక్యూరిటీ గార్డు పాల్‌రాజ్‌లను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు