జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు.

Published : 08 May 2024 05:51 IST

మృతుల్లో ఉగ్రముఠా కమాండర్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో లష్కరే తొయిబా అనుబంధ ఉగ్రముఠా ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)’ టాప్‌ కమాండర్‌ ఉన్నట్లు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్వానీ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సోమవారం అర్ధరాత్రి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. మృతుల్లో ఒకరైన టీఆర్‌ఎఫ్‌ టాప్‌ కమాండర్‌ బాసిత్‌ దార్‌పై 18 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు సిబ్బందితోపాటు పౌరులపై దాడి చేసి చంపిన ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022లో జాతీయ దర్యాప్తు సంస్థ అతడిపై రూ.10లక్షల నజరానా ప్రకటించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు