ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు

కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది.

Published : 08 May 2024 05:52 IST

కెనడాను ఉద్దేశించి భారత్‌ వ్యాఖ్య

దిల్లీ: కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. నేర, వేర్పాటువాద శక్తులకు కెనడాలో సురక్షితమైన ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మంగళవారమిక్కడ మాట్లాడారు. కెనడాలోని తన దౌత్య ప్రతినిధుల భద్రతపై భారత్‌ ఇప్పటికీ ఆందోళనగా ఉందన్నారు. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా బాధ్యతలను నెరవేర్చుతామని కెనడా హామీ ఇస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు