మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ

మొబైల్‌ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్‌ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది.

Published : 08 May 2024 05:53 IST

దిల్లీ: మొబైల్‌ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్‌ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. ఫోన్‌ద్వారా మోసాలు చేసేవారి గురించి ఫిర్యాదులు చేయడానికి ‘చక్షు’ పేరుతో ఒక పోర్టల్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించింది. ఇప్పటివరకు 348 మొబైల్‌ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేసింది. 52 మందిని నిషిద్ధ జాబితాలో చేర్చింది. 10,834 అనుమానిత మొబైల్‌ నంబర్లను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఆర్థిక మోసాల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా ‘చక్షు’ ద్వారా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరింది. ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉన్న/ తప్పుడు పత్రాలతో తీసుకున్న 1.58 లక్షల మొబైల్‌ కనెక్షన్లను ఏప్రిల్‌ 30 నాటికి బ్లాక్‌ చేసినట్లు తెలిపింది. నూతన సిమ్‌కార్డుల కొనుగోలు పరిమితిని అతిక్రమించినందుకు 1.66 కోట్ల మొబైల్‌ కనెక్షన్లను డీవోటీ తొలగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు