రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్‌ పంపి విద్యార్థి అదృశ్యం

విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్‌లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్‌ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

Updated : 10 May 2024 07:49 IST

కోటా: విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్‌లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్‌ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అంతకుముందు విద్యార్థి పంపిన సందేశంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాజస్థాన్‌లోని బమన్‌వాస్‌ ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా నుంచి అతడి తండ్రి జగ్‌దీశ్‌ మీనాకు ఓ సందేశం వచ్చింది. ‘‘నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. ఉన్నత చదువులు చదవాలని లేదు. నావద్ద రూ.8వేలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల వరకు తిరిగిరాను. నా ఫోన్‌ అమ్మేస్తాను. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నా గురించి బాధపడొద్దని అమ్మకు చెప్పండి. నా దగ్గర మీ అందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్‌ చేస్తాను’’ అని అందులో ఉంది. దీంతో ఆందోళన చెందిన జగదీశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఆరో తేదీ నుంచి అతడు కనిపించడం లేదని, ఆ రోజు మధ్యాహ్నం కోటాలోని వసతిగృహం నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. గత ఆదివారం దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు