మా వాడు అమాయకుడు..

దిల్లీలోని ఎర్రకోట వద్ద మంగళవారం సిక్కు మత జెండా(నిషాన్‌ సాహిబ్‌) ఎగురువేయడంలో ఇతరత్రా దురుద్దేశాలు ఏమీ లేవని ఆ ఘటనలో చురుకైన పాత్ర నిర్వహించిన యువకుడి కుటుంబ

Updated : 28 Jan 2021 06:21 IST

ఎర్రకోట వద్ద స్తంభం ఎక్కిన యువకుడి కుటుంబ సభ్యుల వెల్లడి

తరన్‌ తారన్‌: దిల్లీలోని ఎర్రకోట వద్ద మంగళవారం సిక్కు మత జెండా(నిషాన్‌ సాహిబ్‌) ఎగురువేయడంలో ఇతరత్రా దురుద్దేశాలు ఏమీ లేవని ఆ ఘటనలో చురుకైన పాత్ర నిర్వహించిన యువకుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌కు చెందిన జుగ్రాజ్‌.. రైతు గణతంత్ర కవాతులో పాల్గొనేందుకు కొందరు రైతులతో కలిసి దిల్లీ వెళ్లాడని అతని తాత మెహల్‌ సింగ్‌ వెల్లడించారు. ఎర్రకోట వద్దకు చేరిన సమూహంలోని వ్యక్తులు  అక్కడ ఉన్న స్తంభం ఎక్కలేకపోవడంతో వారి సూచన మేరకు జుగ్రాజ్‌ పాకుతూ స్తంభం శిఖరానికి చేరుకున్నాడని పేర్కొన్నారు. ‘జుగ్రాజ్‌ అమాయకుడు. వాడికి ఇతర దురుద్దేశాలు ఏమీ లేవు’ అని తెలిపారు. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారేమోనన్న భయాన్ని మెహల్‌ సింగ్‌ వ్యక్తం చేశారు. జుగ్రాజ్‌ తండ్రి బల్‌దేవ్‌ సింగ్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. మొత్తం నలుగురు సంతానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని