త్వరలో దేశమంతటా ఖేలా హోబె: మమతా బెనర్జీ

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఉపయోగించిన ‘ఖేలా హోబె’ నినాదం త్వరలో దేశమంతటా ప్రతిధ్వనించడం ఖాయమని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌....

Published : 03 Aug 2021 05:30 IST

కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఉపయోగించిన ‘ఖేలా హోబె’ నినాదం త్వరలో దేశమంతటా ప్రతిధ్వనించడం ఖాయమని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకి మమతా బెనర్జీ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్య చేశారు. ‘ఖేలా హోబె’ పథకం ప్రారంభోత్సవంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘మా నినాదం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పార్లమెంటులో, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి పలు రాష్ట్రాల్లో దాన్ని చాలామంది వినియోగించారు. ఇప్పటివరకు ఆడింది చిన్న ఆటే. అసలైన ఆట ముందుంది. త్వరలో జరగబోయే ఆటలో దేశ ప్రజలకు బెంగాల్‌ మార్గనిర్దేశం చేస్తుంది. దాన్ని మేం గర్వంగా భావిస్తాం’’ అని పేర్కొన్నారు. ‘ఖేలా హోబె’ పథకంలో భాగంగా ఫుట్‌బాల్‌ క్లబ్‌లు, ఆటగాళ్లు, కోచ్‌లకు ఫుట్‌బాల్‌లు అందజేయనున్నారు. ఇకపై ఏటా ఆగస్టు 16ను ‘ఖేలా హోబె’ దినోత్సవంగా జరుపుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని