ఐటీబీపీలో తొలిసారిగా మహిళా అధికారులు

ఇండో - టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. స్థానిక ఐటీబీపీ అధికారుల శిక్షణ కేంద్రంలో మొత్తం 53 మంది శిక్షణ పూర్తి చేసుకోగా..

Published : 09 Aug 2021 05:20 IST

మసూరి: ఇండో - టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. స్థానిక ఐటీబీపీ అధికారుల శిక్షణ కేంద్రంలో మొత్తం 53 మంది శిక్షణ పూర్తి చేసుకోగా.. ఆదివారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ కవాతుకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా అధికారులుగా నియమితులైన ప్రకృతి, దీక్షలకు అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంకులను కేటాయించారు. దీక్ష తండ్రి కమలేశ్‌ కుమార్‌ ఐటీబీపీలోనే ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కవాతు అనంతరం కమలేశ్‌ కుమార్‌ యూనిఫాంతో తన కుమార్తె దీక్షకు శాల్యూట్‌ చేశారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ.. ‘మా నాన్నే నాకు ఆదర్శం. ఎన్నడూ నన్ను తక్కువగా చూడలేదు’ అని చెప్పారు. యూపీఎస్సీ పరీక్షల ద్వారా ఐటీబీపీ 2016 నుంచీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అధికారుల స్థాయిలో నియామకం మాత్రం ఇదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని