దాతల పాన్‌ వివరాలు గోప్యం.. రూ.8.9 కోట్ల విరాళాలతో అయిదో స్థానంలో వైకాపా

దేశంలోని 16 ప్రాంతీయ పార్టీలు దాతల పాన్‌ వివరాలు వెల్లడించకుండానే రూ.24.779 కోట్ల విరాళాలు వచ్చినట్లు ప్రకటించాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన గణాంకాల ఆధారంగా అసోసియేషన్‌

Updated : 30 Oct 2021 09:27 IST

వెల్లడించని 16 పార్టీలు

ఈనాడు, దిల్లీ: దేశంలోని 16 ప్రాంతీయ పార్టీలు దాతల పాన్‌ వివరాలు వెల్లడించకుండానే రూ.24.779 కోట్ల విరాళాలు వచ్చినట్లు ప్రకటించాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన గణాంకాల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఓ నివేదిక రూపొందించింది. మొత్తం 53 ప్రాంతీయ పార్టీలకుగానూ రెండు పార్టీలు సకాలంలో నివేదికలు సమర్పించాయి. ఆరు నుంచి 320 రోజులు ఆలస్యంగా 28 పార్టీలు అందించాయి. మరో 23 పార్టీలు శుక్రవారం నాటికీ వివరాలు ఇవ్వలేదు. ఇందులో పాన్‌ వివరాలు లేకుండానే 16 పార్టీలు నివేదికలు సమర్పించాయి. వాటి ఆధారంగా ఏడీఆర్‌ రూపొందించిన నివేదిక ప్రకారం... 2019-20లో 436 మంది దాతల నుంచి వచ్చిన రూ.62.859 కోట్ల విరాళాలతో శివసేన ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం ముగ్గురి నుంచి వచ్చిన రూ.52.17 కోట్లతో అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంది. రూ.37.37 కోట్ల విరాళాలతో ఆప్‌ మూడో స్థానంలో, రూ.28.20 కోట్ల విరాళాలతో బిజూ జనతాదళ్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. రూ.8.924 కోట్లతో వైకాపా అయిదో స్థానంలో ఉంది. 2018-19తో పోల్చితే తమకు విరాళాలు ఎక్కువగా వచ్చాయని అన్నాడీఎంకే, ఆప్‌ తెలపగా, తమకు తగ్గాయని శివసేన, వైకాపా పేర్కొన్నాయి. నగదు రూపంలో అత్యధికంగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు రూ.46.3 కోట్లు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని