Narendra Dabholkar: నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు

ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్‌ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది.

Updated : 10 May 2024 12:18 IST

దిల్లీ: ప్రముఖ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు పడింది. ఈ కేసులో వీరిని దోషులుగా తేల్చిన పుణె కోర్టు.. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన గళం వినిపించిన దభోల్కర్‌.. ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ స్థాపించి ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఆ క్రమంలోనే ఆయనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. 2013, ఆగస్టు 20న ఉదయం నడకకు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొదట పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా.. తర్వాత దానిని సీబీఐకి బదిలీ చేశారు. 11 ఏళ్ల తర్వాత ఈ కేసులో దోషులకు శిక్ష పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు