వైభవంగా లేగదూడకు నామకరణ వేడుక

శిశువులకు 21వ రోజున నామకరణ వేడుక చేసి పేరు పెట్టడం చూశాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాకు చెందిన ఓ కుటుంబం మాత్రం వినూత్నంగా లేగదూడకు వైభవంగా నామకరణ వేడుక నిర్వహించి

Updated : 19 Dec 2021 09:59 IST

భోపాల్‌: శిశువులకు 21వ రోజున నామకరణ వేడుక చేసి పేరు పెట్టడం చూశాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాకు చెందిన ఓ కుటుంబం మాత్రం వినూత్నంగా లేగదూడకు వైభవంగా నామకరణ వేడుక నిర్వహించి పేరు పెట్టింది. ఆవు దూడ పుట్టిన ఆరో రోజున ఈ వేడుక చేసింది. బంధుమిత్రులు, గ్రామస్థుల సమక్షంలో.. సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించి లేగదూడకు పేరు పెట్టారు. పుట్టిన సమయాన్ని బట్టి దూడకు ‘జమున’గా పేరు నిర్ణయించారు పండితుడు. వేడుకకు హాజరైన బంధువులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఖండ్వాలోని కిన్నర్‌ సమాజానికి చెందిన సీతారాజాన్‌ అనే ట్రాన్స్‌వుమెన్‌ కైలాశ్‌ అనే వ్యక్తిని 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. తాను పిల్లలను కనలేనని, తన ఇంట్లోని ఆవునే సొంత కుమార్తెలా చూసుకుంటున్నట్లు ఈ సందర్భంగా సీతారాజన్‌ చెప్పారు. నామకరణ కార్యక్రమంలో ఖండ్వా ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ సైతం పాల్గొనడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని