
Updated : 24 Dec 2021 07:13 IST
రెండుకాళ్లకు మేకులు దింపి.. చనిపోయాడని వదిలేసి..
బాడ్‌మేడ్: ఆర్‌టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక.. రెండు కాళ్లకు మేకులు దింపి, చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన క్రూరమైన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసినందుకే మాజీ సర్పంచ్ ఈ దాడి చేయించారని బాడ్‌మేడ్ జిల్లాకు చెందిన సహ చట్టం కార్యకర్త అమరా రామ్ గోదారా ఆరోపించారు. గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయన్ని గ్రామస్థులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆర్‌టీఐ కార్యకర్తపై దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.
Tags :