Suspend: మీసం పెంచినందుకు కానిస్టేబుల్‌పై వేటు.. ఎక్కడంటే!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాకేశ్‌ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. సింహా సినిమాలో బాలకృష్ణ తరహాలో మీసం పెంచుకోవడమే ఇందుకు కారణం.

Updated : 10 Jan 2022 13:38 IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాకేశ్‌ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. సింహా సినిమాలో బాలకృష్ణ తరహాలో మీసం పెంచుకోవడమే ఇందుకు కారణం. రాణా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారని, వాటిని కత్తిరించుకోమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్‌ శర్మ తెలిపారు. యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తీ అటువంటి వేషధారణతో విధులకు హాజరు కారాదని స్పష్టం చేశారు. మరోవైపు, వేటు వేయడంపై కానిస్టేబుల్‌ రాణా స్పందించారు. పొడవుగా పెంచిన మీసాలను తగ్గించేది లేదని స్పష్టం చేశారు. చాలా కాలంగా మీసాలను పెంచుతున్నానని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అధికారులు చెప్పినట్లుగా తాను ఎప్పుడూ యూనిఫాం లేకుండా విధులకు హాజరవలేదని స్పష్టంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని