Molnupiravir: మోల్నుపిరవిర్‌తోసంతానోత్పత్తి సమస్యలు..కొవిడ్‌ చికిత్సలో వద్దు!

కొవిడ్‌ ప్రామాణిక చికిత్సలో ‘మోల్నుపిరవిర్‌’ను చేర్చేందుకు.. ఐసీఎంఆర్‌ సారథ్యంలోని కొవిడ్‌-19 జాతీయ కార్యదళం నిరాకరించింది. కొవిడ్‌ చికిత్సలో ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, పైగా దీని వాడకంతో సంతానోత్పత్తి, కండరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం

Updated : 12 Jan 2022 09:40 IST

ఐసీఎంఆర్‌ సూచనలు

దిల్లీ: కొవిడ్‌ ప్రామాణిక చికిత్సలో ‘మోల్నుపిరవిర్‌’ను చేర్చేందుకు.. ఐసీఎంఆర్‌ సారథ్యంలోని కొవిడ్‌-19 జాతీయ కార్యదళం నిరాకరించింది. కొవిడ్‌ చికిత్సలో ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, పైగా దీని వాడకంతో సంతానోత్పత్తి, కండరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. మోల్నుపిరవిర్‌ కరోనా వైరస్‌ ప్రతిరూపాలను అరికట్టి మ్యుటేషన్‌ను నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి వీలుగా డ్రగ్‌ రెగ్యులేటర్‌ జనరల్‌ గతేడాది డిసెంబరు 28న అనుమతిచ్చింది. ఈ అంశంపై సోమవారం జరిగిన కొవిడ్‌-19 జాతీయ కార్యదళం సమావేశంలో సానుకూలత వ్యక్తం కాలేదు. దీని వాడకంతో గర్భంలో పెరిగే పిండంలో లోపాలు తలెత్తుతాయని, శరీర కండరాలు కూడా బలహీనమవుతాయని విశ్లేషించారు. ఈ మందును మగ, ఆడ రోగుల్లో ఎవరికి ఇచ్చినా మూడు నెలల పాటు వారు సంతానోత్పత్తి ప్రక్రియలో ఉండరాదని, లేకుంటే పుట్టే పిల్లల్లో తీవ్రమైన లోపాలు ఉండొచ్చని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ తెలిపారు. మోల్నుపిరవిర్‌ను అత్యవసర వినియోగానికి తొలుత అనుమతించిన బ్రిటన్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని ఇంతవరకు ప్రామాణిక చికిత్సలో చేర్చలేదన్నారు. తీవ్రస్థాయి అనారోగ్యానికి గురయ్యే వారికి మాత్రమే ఈ మందు ఇస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని