తట్టు టీకా వికటించిముగ్గురు చిన్నారుల మృతి

కర్ణాటకలోని బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రుబెల్లా టీకా వేశారు. వెంటనే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది

Updated : 17 Jan 2022 06:24 IST

కర్ణాటకలో ఘటన

బెళగావి, న్యూస్‌టుడే: కర్ణాటకలోని బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రుబెల్లా టీకా వేశారు. వెంటనే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. పరిస్థితి విషమించడంతో పవిత్రా హులగూర (13 నెలలు), మధు కరగుంది (14 నెలలు), చేతన్‌ పూజారి (15 నెలలు) కన్నుమూశారు. మరో చిన్నారి ఆరోగ్యం కూడా విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని