
24 గంటల్లో 2,86,384 కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గురువారం 19.59%కి చేరింది. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉ. 8 వరకు) 2,86,384 మంది కొత్తగా వైరస్ బారిన పడగా.. 573 మంది కొవిడ్‌తో మృతి చెందారు.
95% వయోజనులకు కొవిడ్ టీకా తొలిడోసు
దిల్లీ: దేశంలో వయోజనుల్లో 95% మందికి కొవిడ్ టీకా తొలిడోసు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 74% మందికి రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది. ఇంతవరకు 164.35 కోట్ల టీకా డోసులు వేసినట్లు పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.