SBI: గర్భిణుల నియామక నిబంధనల్లో ఎస్‌బీఐ మార్పులు

‘నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారని, వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామ’ని

Updated : 29 Jan 2022 08:17 IST

దిల్లీ/ముంబయి: ‘నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారని, వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామ’ని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సమాజంలోని భిన్న వర్గాలతో పాటు ఆలిండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరే వారి కోసం 2021 డిసెంబరు 31న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ‘గర్భం కనుక 3 నెలల్లోపు ఉంటే’ ఆ మహిళను ఉద్యోగంలో చేర్చుకోవచ్చు. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చింది. పదోన్నతులపై వెళ్లే వారికి 2022 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటివరకు 6 నెలల వరకు గర్భం ఉన్న మహిళ వివిధ షరతులకు లోబడి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నూతన నిబంధనను సత్వరం ఉపసంహరించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వమ్‌ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని