సంప్రదాయ వస్త్రధారణలో హిజాబ్‌ భాగం కాదు

ముస్లిం సంప్రదాయ వస్త్రధారణలో హిజాబ్‌ భాగంకాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రభులింగ్‌ నవదగ్‌ వివరించారు. హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి

Published : 19 Feb 2022 07:59 IST

కర్ణాటక హైకోర్టుకు వివరించిన ఏజీ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ముస్లిం సంప్రదాయ వస్త్రధారణలో హిజాబ్‌ భాగంకాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రభులింగ్‌ నవదగ్‌ వివరించారు. హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. ఏకరూప దుస్తులు ధరించాలన్న ప్రభుత్వ ఆదేశం రాజ్యాంగంలోని ‘మతస్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ’ను ఉల్లంఘించలేదని ఏజీ స్పష్టం చేశారు. హిజాబ్‌ ధరించటం వారి మౌలిక హక్కా? కాదా? అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటం వల్ల అభ్యంతరాలు, ఆక్షేపణలు పెరుగుతాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రవివర్మ కుమార్‌ చెప్పారు. ఈ ప్రసారం వల్ల ప్రతివాదనలు ఎలా ఉంటాయో ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా? అని జస్టిస్‌ అవస్థి అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని