విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీకి ఆర్థిక సాయం.. ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ‘నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌’ పథకం కింద 2022-23 విద్యాసంవత్సరంలో విదేశాల్లో చదవాలనుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 17 Aug 2022 12:21 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ‘నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌’ పథకం కింద 2022-23 విద్యాసంవత్సరంలో విదేశాల్లో చదవాలనుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు విదేశీ వర్సిటీలో చేరాక ఏటా నిర్వహణ వ్యయం, కోర్సు ఫీజు, వీసా, విమాన ప్రయాణ ఖర్చులకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. అభ్యర్థులు ‌్ర్ర్ర.-్న(్ఝ(ౖ’.్ణ్న‌్ర.i- వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని