Corona Virus: రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్‌ సీట్ల పునరుద్ధరణ

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లను పునరుద్ధరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం జనరల్‌ క్లాస్‌లో ప్రయాణికులు ఇదివరకు మాదిరి అప్పటికప్పుడు టికెట్లు కొని ప్రయాణించవచ్చు.

Updated : 01 Mar 2022 07:13 IST

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లను పునరుద్ధరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం జనరల్‌ క్లాస్‌లో ప్రయాణికులు ఇదివరకు మాదిరి అప్పటికప్పుడు టికెట్లు కొని ప్రయాణించవచ్చు. కొవిడ్‌ సమయంలో ఈ జనరల్‌ క్లాస్‌ టికెట్లనూ రిజర్వేషన్‌ కేటగిరీగా మార్చి అందులో ఉన్న సీట్ల సంఖ్యవరకు మాత్రమే రైల్వేశాఖ విక్రయించేది. అందుకోసం రిజర్వేషన్‌ ఛార్జీ కింద రూ.20 అదనంగా వసూలుచేసేది. ఇప్పుడు వాటిని కొవిడ్‌ ముందునాటి మాదిరి మార్చినందున జనరల్‌క్లాస్‌ టికెట్‌ తీసుకొనేవారు ఇకపై రూ.20 అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని