Flights: 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రెండేళ్ల విరామం అనంతరం ఈ నెల 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 09 Mar 2022 08:54 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రెండేళ్ల విరామం అనంతరం ఈ నెల 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020, మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఎయిర్‌ బబుల్‌ ఏర్పాట్లలో భాగంగా 37 దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో విమాన సేవల భాగస్వామ్య సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నెల 27 నుంచి మళ్లీ అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని