ఎల్‌ఓసీ సమీపంలో కూలిన సైనిక హెలికాప్టర్‌ సహ పైలట్‌ మృతి

కశ్మీర్‌ ఉత్తర ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్‌ కూలిన ఘటనలో సహ పైలట్‌ మృతి చెందగా.. పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కు సమీపాన బందిపోరా జిల్లా గురెజ్‌ సెక్టార్‌లోని

Published : 12 Mar 2022 05:27 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌ ఉత్తర ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్‌ కూలిన ఘటనలో సహ పైలట్‌ మృతి చెందగా.. పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కు సమీపాన బందిపోరా జిల్లా గురెజ్‌ సెక్టార్‌లోని బరౌబ్‌ ప్రాంతం వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పర్వత ప్రాంతాల్లో సరిహద్దుకు సమీపాన ఉన్న ఓ శిబిరం నుంచి.. అనారోగ్యానికి గురైన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళుతున్న హెలికాప్టర్‌ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కూలిపోయి ఓ నాలాలో పడిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సహ పైలట్‌ను మేజర్‌ సంకల్ప్‌ యాదవ్‌ (29)గా గుర్తించారు. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఆయన ఆయన 2015లో సైన్యంలో చేరారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైలట్‌ (లెఫ్టినెంట్‌ కర్నల్‌ ర్యాంకు అధికారి)ని ఉధమ్‌పుర్‌ కమాండ్‌ ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని