విచారణకు కదిలొచ్చిన శివుడు.. భూకబ్జా కేసులో హాజరు

భూఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు తాఖీదులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరయ్యాడు మహాశివుడు(శివలింగం). ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగింది. శివుడితో పాటు నోటీసులు

Updated : 26 Mar 2022 09:57 IST

భూఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు తాఖీదులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరయ్యాడు మహాశివుడు(శివలింగం). ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగింది. శివుడితో పాటు నోటీసులు అందుకున్న మరో 9 మంది విచారణకు హాజరయ్యారు. తమతో పాటు గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చారు. రాయ్‌గఢ్‌ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్‌పుర్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం 10 మందికి నోటీసులిచ్చారు. ఈనెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు (భూమిని ఖాళీ చేయించి, రూ.10 వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు. దీంతో శివలింగంతో సహా నోటీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని