తమిళనాడు చిన్నారులకు యాపిల్‌ సీఈవో అభినందనలు!

తమిళనాడుకు చెందిన విద్యార్థులు అద్భుతంగా ఫొటోలు తీసి అలరింపజేశారని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రశంసించారు. ఐఫోన్‌ 13 మినీ ద్వారా 40 మంది విద్యార్థులు తీసిన ఛాయాచిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Updated : 27 Mar 2022 07:02 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడుకు చెందిన విద్యార్థులు అద్భుతంగా ఫొటోలు తీసి అలరింపజేశారని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రశంసించారు. ఐఫోన్‌ 13 మినీ ద్వారా 40 మంది విద్యార్థులు తీసిన ఛాయాచిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎగ్మూరు మ్యూజియంలో ఈ ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ‘ఏ ల్యాండ్‌ ఆఫ్‌ స్టోరీస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనపై యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ట్వీట్‌ చేసి అభినందించారు. విద్యార్థులు తీసిన రెండు ఫొటోలను ఆ ట్వీట్‌కు జతచేశారు. ఈ ప్రదర్శన గురించి సీబీపీ విద్యా సంస్థ అధ్యక్షురాలు గాయత్రి మాట్లాడుతూ... ‘‘పిల్లలతో ఇలాంటి కార్యక్రమాన్ని మూడోసారి నిర్వహించాం. మేం ఇచ్చిన ఐఫోన్లతో విద్యార్థులు వారాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బృందాలుగా వెళ్లి ఫొటోలు తీశారు. అవి ప్రజల జీవనశైలి, సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేసేలా ఉన్నాయని’’ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని