Cheetah Cub: కూరగాయల ట్రేలో చిరుత పులి కూన

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా ఉథడ్‌పేట్‌ గ్రామ రైతు వామన్‌ కిన్నాకే.. ఊరికి సమీపంలోనే ఉన్న పొలంలో కూరగాయలు సాగుచేస్తున్నారు. గురువారం కోతలు మొదలుపెట్టారు. కోసిన బీరకాయలను పొలంలోనే ఉన్న ట్రేలో వేసే క్రమంలో దానిపై కప్పిన గోతాన్ని

Updated : 29 Apr 2022 06:14 IST

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా ఉథడ్‌పేట్‌ గ్రామ రైతు వామన్‌ కిన్నాకే.. ఊరికి సమీపంలోనే ఉన్న పొలంలో కూరగాయలు సాగుచేస్తున్నారు. గురువారం కోతలు మొదలుపెట్టారు. కోసిన బీరకాయలను పొలంలోనే ఉన్న ట్రేలో వేసే క్రమంలో దానిపై కప్పిన గోతాన్ని తీయగా చిరుతపులి కూన కన్పించడంతో అవాక్కయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిచ్‌పల్లి అటవీశాఖ అధికారి దాన్ని చంద్రపూర్‌కు తరలించారు. ఈ కూనకు సుమారు మూడున్నర నెలల వయసు ఉంటుందని వెల్లడించారు. దాన్ని చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు.

- న్యూస్‌టుడే, బల్లార్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని