Spicejet: కుదుపులకు లోనైన స్పైస్‌జెట్‌ విమానం.. ప్రయాణికుల్లో ఆందోళన

స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ బి737 విమానమొకటి వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం గాల్లో భారీగా కుదుపులకు (టర్బలెన్స్‌) లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Updated : 02 May 2022 09:34 IST

12 మందికి గాయాలు

దిల్లీ: స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ బి737 విమానమొకటి వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం గాల్లో భారీగా కుదుపులకు (టర్బలెన్స్‌) లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముంబయి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్‌ నగరానికి చేరుకున్న విమానం ల్యాండ్‌ అవడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పైస్‌జెట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని