భారత్‌లోకి పాక్‌ ‘గూఢచారి’ పావురం!

పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఓ పావురం భారత్‌లోకి వచ్చింది. దాని రెక్కలపై గణాంకాల రూపంలో గూఢ భాష ఉండటంతో మన అధికారులు అప్రమత్తమయ్యారు. పావురాన్ని పోలీస్‌స్టేషనులో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా

Published : 25 May 2022 04:51 IST

పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఓ పావురం భారత్‌లోకి వచ్చింది. దాని రెక్కలపై గణాంకాల రూపంలో గూఢ భాష ఉండటంతో మన అధికారులు అప్రమత్తమయ్యారు. పావురాన్ని పోలీస్‌స్టేషనులో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్‌ చేయడానికి శ్రమిస్తున్నారు. సాధారణంగా పాక్‌ నుంచి భారత సరిహద్దులకు పావురాలు వస్తుంటాయి. అనుమానాస్పదంగా ఉన్నవాటిని మన అధికారులు అదుపులోకి తీసుకుంటారు. గూఢచర్యానికి సంబంధించినవి కాదని నిర్ధరించుకున్న తర్వాతే విడిచిపెడతారు. ఇటీవలే సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌ మహిళకు చేరవేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని