అగ్నిపథ్‌పై దేశవ్యాప్త నిరసనలు

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో శుక్రవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వ్యవసాయ, కార్మిక సంఘాల, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ శాంతియుత నిరసనల్లో

Published : 25 Jun 2022 04:45 IST

ఎస్‌కేఎం ప్రకటన

దిల్లీ: అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో శుక్రవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వ్యవసాయ, కార్మిక సంఘాల, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ శాంతియుత నిరసనల్లో పాల్గొన్నారని ఎస్‌కేఎం ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌, దిల్లీ, హరియాణ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, తదితర రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్‌ హెడ్‌క్వార్టర్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు అందజేసినట్లు వివరించింది. అగ్నిపథ్‌ పేరుతో దేశ యువతను కేంద్రం వంచిస్తోందని ఎస్‌కేఎం విమర్శించింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎస్‌కేఎం సుదీర్ఘ నిరసనలు కొనసాగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని