రెండో రోజూ తగ్గిన కరోనా కొత్త కేసులు

దేశంలో కొవిడ్‌-19 కొత్త కేసులు వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఈ మేరకు తాజాగా (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు) 11,739 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 15,940గా నమోదైన

Published : 27 Jun 2022 05:16 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కొత్త కేసులు వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఈ మేరకు తాజాగా (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు) 11,739 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 15,940గా నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు, మొత్తం మరణాల సంఖ్య 5,24,999కు చేరింది. కరోనాతో పోరాడుతూ తాజాగా 25 మంది మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 92,576కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో వీటి వాటా 0.21 శాతంగా ఉన్నట్లు వివరించింది. మరోవైపు, రోజువారీ పాజిటివీటీ రేటు 2.59గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని