రౌత్‌కు మరోసారి ఈడీ సమన్లు

మహారాష్ట్రలో శివసేన పార్టీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. అదే పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ముంబయిలోని

Published : 29 Jun 2022 04:34 IST

నెలాఖరు వరకు హాజరు నుంచి ఉపశమనం

ముంబయి: మహారాష్ట్రలో శివసేన పార్టీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. అదే పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ముంబయిలోని ఓ బలహీనవర్గాల గృహ సముదాయం పునరభివృద్ధి, పలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అక్రమాల కేసులో.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఆయన్ను ప్రశ్నించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రౌత్‌కు ఈడీ సోమవారం జారీచేసిన సమన్లలో మంగళవారమే హాజరు కావాలని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాను ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున మరింత సమయం కావాలని ఆయన ఈడీని కోరారు. ఈమేరకు రెండు వారాల వ్యవధి కావాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరగా ఈడీ ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని